ఏడుపదుల వయసులో వరంగల్ అర్బన్ జిల్లా రంగశాయిపేట ఎస్సీ కాలనీకి చెందిన ఐలమ్మ అనే వృద్ధురాలు పోరాటం చేస్తోంది. తన 20 గజాల స్థలాన్ని బుంగ జ్యోతి అనే మహిళ కబ్జా చేసిందని ధర్నా చేసింది. నివాసం ఏర్పరుచుకునేందుకు పనులు మొదలు పెట్టగా... చంపుతానంటూ బెదిరిస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది.
న్యాయం చేయాలని... కార్పొరేటర్, వరంగల్ మహానగర పాలక సంస్థ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వృద్ధురాలు వాపోయింది. అధికారులు సైతం కబ్జాదారులకు సహకరిస్తున్నారని ఆరోపించింది. తన భూమి ఇప్పించాలని వేడుకుంది. న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తానని ఐలమ్మ తెలిపింది.
ఇదీ చూడండి: ఉపాధి పేరిట మహిళల అక్రమ రవాణా... ముఠా అరెస్ట్