చారిత్రక, వారసత్వ సంపద పట్ల అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని రామప్ప రామలింగేశ్వరాలయానికి చెందిన ప్రహరీ గోడ నిర్మాణ విషయంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు.
ప్రపంచ స్థాయిలో గొప్ప నిర్మాణాల జాబితాలో చోటు సంపాదించిన రామప్ప ఆలయ నిర్వహణ విషయంలో అధికారులు బాధ్యతాయుతంగా ఉండడం లేదన్నది స్పష్టమవుతున్నది. 2019 సెప్టెంబర్ నెలలో యునెస్కో ప్రతినిధి వాసుపోస్య నందన్ పర్యటన నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన రెండు వరుసల్లో గోడ నిర్మాణం చేపట్టారు.
అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ పనులు ఏమాత్రం ముందుకు సాగలేదు. మళ్లీ ఇప్పుడు రెండు వరుసల్లో నిర్మిస్తున్న గోడ మధ్యలో డంగుసున్నం, ఇటుకలతో తయారుచేసిన కాంక్రీటు నింపుతున్నారు. ఆ పనులు పూర్తయిన తర్వాత గోడ నిర్మాణం పూర్తి చేస్తాం అంటున్నారు పురావస్తు అధికారులు.