ETV Bharat / city

PV MEMORIES: వంగరలో స్మృతివనం.. భావోద్వేగానికి లోనైన పీవీ సంతానం

బహుభాషా కోవిదుడు... సంస్కరణలకు ఆద్యుడు... గొప్ప రాజనీతిజ్ఞుడు.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన పేరుతో వంగరలో స్మృతివనం నిర్మించడం చాలా గొప్ప విషయమని... పీవీ కుమార్తె సురభి వాణిదేవి అన్నారు. ఆనాటి జ్ఞాపకాలను పీవీతో గడిపిన రోజులను గుర్తుతెచ్చుకుని ఒకింత భావోద్వేగానికి లోనైయ్యారు.

PV MEMORIES
స్మృతి వనం
author img

By

Published : Aug 28, 2021, 3:32 PM IST

పుట్టి పెరిగిన ఊళ్లో.... తండ్రి పేరుతో నిర్మితమౌతున్న స్మృతి వనం... వారిద్దరికీ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసింది. ఒక్కసారిగా ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. పీవీ నరసింహరావు స్మృతివనం శంకుస్ధాపన కార్యక్రమంలో... ఆయన కుమార్తె సురభి వాణిదేవి, కుమారుడు ప్రభాకరరావు పాల్గొన్నారు. పీవీతో గడిపిన అనుభవాలను.. ఆయన చివరిమాటలను నెమరువేసుకున్నారు. పీవీ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడమే కాకుండా... వంగరను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలిపారు.

జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ..

పీవీ కుమార్తె సురభి వాణిదేవి మాట్లాడుతూ... ఇక్కడ అన్ని మేం ఆడుకున్న ప్రాంతాలే. మా బాల్యం అంతా ఇక్కడే గడిచిందని తెలిపారు. ''ఈ ఊరంటే నాకు ఎంతో ఇష్టం. నేను చాలా చాలా అదృష్టవంతురాలిని. ఇక్కడ పాఠశాలలలో ఐదో తరగతి చదువుకున్నాను. చిన్నప్పుడు ఇక్కడే పొలాల్లో, చెట్లలో, గుట్టల్లో ఆడుకునే వాళ్లం. ఇదే ఇంట్లో పుట్టాం. నా గురించి తెలియని వారెవరూ ఇక్కడ లేరు. ఇక్కడే చాలా పెయింటింగ్స్ వేశాను. వాటికి సారే జహాసే అచ్చా అని పేరు పెట్టా. వాషింగ్టన్ డీసీలో అవి ప్రచురితమైయ్యాయి. ఎక్కడ వంగర... ఎక్కడ వాషింగ్టన్ డీసీ.

PV MEMORIES
పార్క్ నమూనా

పీవీ ఓ అద్భుతమైన వ్యక్తి. ఇక్కడ పుట్టి...పెరిగి... దేశానికి ప్రధానై... ఎర్రకోట మీద జెండా ఎగరేసిన వ్యక్తి పీవీ. పీవీ బిడ్డగా ఆయన గురించి గొప్పతనం గురించి ఎన్ని రోజులైనా చెపుతాను. ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. మాకు ధైర్యం, భరోసా కల్పించింది ఆయనే. ఇప్పుడు ఈ ప్రాంతంలో పచ్చదనం వెల్లివిరిస్తోంది. పట్టణం కన్నా.. వంగరే బాగుందనే విధంగా అభివృద్ధి చేశారు. నాన్న వాడిన వస్తువులు... భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయ్. ఎమ్మెల్సీగా కాదు... వంగర వాస్తవ్యురాలిగా... పీవీ బిడ్డలుగా... ముఖ్యమంత్రికి, మంత్రులకు కృతజ్ఞతలు తెలుపుతున్నా'... అంటూ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే..

కేసీఆర్ సర్కార్ చేస్తున్న సాయం మరువలేనిదని... పీ.వీ ప్రభాకరరావు తెలిపారు. పట్టుదలతో శ్రమిస్తే... సాధ్యం కానిదేదీ లేదనడానికి పీవీ జీవితమే చక్కని ఉదాహరణ అని... అది అందరికీ ప్రేరణ కలిగిస్తుందని వెల్లడించారు. పీవీ ఐదేళ్ల పాలనలోనే దేశం ప్రగతి బాట పట్టిందని... నేడు రాష్ట్రాల్లో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు... పీవీ ఆలోచనలోనుంచి పుట్టినవేనన్నారు.

PV MEMORIES
ప్రవేశం

పీవీకి వంగర అంటే చాలా ఇష్టమని... ఈ చుట్టపక్కలే ఆయన ఎక్కువ తిరిగారని ప్రభాకరరావు గుర్తుచేసుకున్నారు. పీవీ చివరి మాటలూ వంగర గురించే చెప్పారని తెలిపారు. ఆయన తెలంగాణ ముద్దుబిడ్డ... పీవీ నడిచిన ఇల్లు... శిథిలావస్థకు చేరడంతో బాగు చేయాలనుకున్నా. ప్రభుత్వమే ఆ బాధ్యతలు తీసుకుని... పీవీ వాడిన వస్తువులన్నీ ఇక్కడ ప్రదర్శించేలా ఏర్పాట్లు చేయడం నిజంగా అభినందించదగిన విషయమని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన శతజయంతి ఉత్సవాలు అద్భుతంగా జరిగాయని.. ఇక్కడే కాకుండా మరో 55 దేశాల్లో తెలుగు వాళ్లు ఉత్సవాలు నిర్వహించారని తెలిపారు. వంగరలో స్మృతి వనం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రూ. 7 కోట్లు మంజూరు చేశారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వంగరను చక్కటి పర్యాటక స్ధలంగా మారుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: pv smruthi vanam: వంగరలో పీవీ స్మృతివనానికి మంత్రుల శంకుస్థాపన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.