మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. ఓ రోజు ఇంటికి వెళ్లేటప్పుడు ఆ విద్యార్థి ఉపాధ్యాయులకు చెప్పకుండా వెళ్లాడు. అదే ఆ విద్యార్థి చేసిన నేరం.. దాంతో ఆగ్రహించిన వ్యాయామ ఉపాధ్యాయుడు తిరిగి వచ్చిన ఆ విద్యార్థిని విచక్షరహితంగా కొట్టడమే కాకుండా అసభ్యపదజాలంతో దూషించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇప్పుడు ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై పాఠశాల ప్రిన్సిపల్ ముత్తయ్యను ఫోన్లో వివరణ అడగ్గా వారం రోజులు కిందట జరిగిన ఈ ఘటన వాస్తమేనని.. మరోసారి ఇలాంటివి పునరావృతం కావద్దని పీఈటీని హెచ్చరించామని ఆయన తెలిపారు.
ఇవీ చదవండి: