వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం మడికొండలో పెద్దమ్మ తల్లి బోనాలు వైభవంగా జరిగాయి. ముదిరాజ్ కులస్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి బోనం సమర్పించారు. నైవేద్యం, నూతన వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తమ కుటుంబాన్ని చల్లగా చూడాలి తల్లి అంటూ అమ్మవారిని వేడుకున్నారు. పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడం వల్ల ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
- ఇదీ చూడండి : మధురై మీనాక్షి పట్టాభిషేకంలో మహాత్ముడు!