ETV Bharat / city

'బడా కంపెనీలతో కుమ్మకై... రైతులకు అన్యాయం చేస్తున్నారు' - సీతక్క తాజా వార్తలు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ కిసాన్‌ సెల్‌ ఆధ్వర్యంలో ములుగు జిల్లా కేంద్రంలో ఎడ్ల బండ్ల ర్యాలీ నిర్వహించారు.ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే సీతక్క కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ బిల్లుతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు. బడా కంపెనీలతో కుమ్మకైన ప్రధాని మోదీ రైతులకు అన్యాయం చేసేలా వ్యవసాయ బిల్లును ప్రవేశపెట్టారని తెలిపారు.

'బడా కంపెనీలతో కుమ్మకైన రైతులకు అన్యాయం చేస్తున్నారు'

author img

By

Published : Sep 26, 2020, 11:35 AM IST

దళారులు, కార్పొరేట్‌ కంపెనీలు లాభపడే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును రూపొందించినట్లు ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. బిల్లును నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో మలుగు జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ హయాంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా ఎప్పటికప్పుడు వాటి నిల్వలపై పరిమితులు విధించేదని సీతక్క గుర్తు చేశారు. ఇప్పుడు భాజపా ప్రభుత్వం అటువంటి పరిమితులు పూర్తిగా ఎత్తేశారని ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బడా కంపెనీలతో కుమ్మకైన ప్రధాని మోదీ రైతులకు అన్యాయం చేసేలా వ్యవసాయ బిల్లును ప్రవేశపెట్టారని తెలిపారు.

రైతుకే మాయమాటలు చెపుతున్న కేంద్ర ప్రభుత్వంఈ బిల్లు ప్రకారం సప్లై​ చైన్​లో.. రైతుల నుంచి రీటైలర్ వరకూ ఎవరు ఎంతైనా స్టోర్ చేసుకోవచ్చని వివరించారు. ఈ బిల్లును బాగా అర్థం చేసుకుంటే, 86% చిన్న సన్నకారు రైతులున్న దేశంలో రైతులు తమ పొలంలో పండిన వాటిని సొంతంగా స్టోర్ చేసుకోలేరని తెలిపారు. దళారీలు పంటను నిల్వ చేసుకుని ఇష్టం వచ్చినట్లు ధరలు పెంచుకునే అవకాశం ఉందన్నారు. ఫలితంగా రైతు నష్టపోతారని.. ఈ బిల్లు వల్ల సన్నకారు రైతులంతా కూలీలుగా మారే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి: వ్యవసాయ బిల్లుల ఆమోదంతో యార్డుల పాత్ర నామమాత్రం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.