పట్టభద్రులు ఓటేసేముందు ఆలోచించి.. అభివృద్ధికే పట్టం కట్టాలని ఎమ్మెల్యే వినయభాస్కర్ కోరారు. వరంగల్, హన్మకొండలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే.. ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. దేశంలో ఎక్కడా లేని పథకాలను.. రాష్ట్రంలో అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను చూసైనా.. తెరాస అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ఇదీ చదవండి: 'న్యాయవాదులను ఓట్లడిగే హక్కు.. తెరాసకు లేదు'