ఎన్ని ఆటంకాలు ఎదురైనా... ఎవరడ్డొచ్చినా... మామునూర్ ఏయిర్ పోర్ట్ ఆగదని మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. ఈ విషయంలో కేంద్రంతో పోరాటానికైనా సిద్ధమని సవాల్ విసిరారు. వరంగల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్నారు.
43, 44 వార్డుల పరిధిలో ఉన్న మామునూర్ ఎయిర్పోర్టును సాధిస్తామన్నారు. అందుకోసం పోరాటానికి సిద్ధం కావాలని మామునూర్ ప్రజలకు సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: ప్రతిపక్షాలకు గుణపాఠం చెప్పండి: ఎర్రబెల్లి