'పల్లె ప్రగతి' కార్యక్రమంతోనే పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని.. పల్లెలు పచ్చదనం పరచుకుని - పరిశుభ్రతతో ఉన్నందువల్లే, రాష్ట్రానికి జాతీయ స్థాయిలో అవార్డులు దక్కుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలోని ఉప్పరపల్లిలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్, డీసీసీబీ ఛైర్మన్ మార్నేని రవీందర్‌రావుతో కలిసి డంపింగ్ యార్డును మంత్రి ప్రారంభించారు.
పల్లె ప్రగతి కార్యక్రమం వల్ల పల్లెలు పచ్చగా మారాయని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. డంపింగ్ యార్డులు, ప్రకృతి వనాలు, నిరంతర పారుశుద్ధ్యం, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, రైతు వేదికలు.. ఇలా అనేకం వస్తున్నాయన్నారు. నిరంతరం పారిశుద్ధ్యం జరుగుతున్నందున కరోనా వ్యాప్తి తగ్గిందని.. సీజనల్ వ్యాధులు పూర్తిగా అదుపులోకి వచ్చాయని మంత్రి తెలిపారు.
ఇదీ చదవండిః ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్లు ఇస్తాం : మంత్రి ఎర్రబెల్లి