ETV Bharat / city

'విద్యుత్​ వాడకంలో దేశంలోనే తెలంగాణ నంబర్​ వన్​'

author img

By

Published : Oct 6, 2020, 12:41 PM IST

వరంగల్ పోచమ్మ మైదానం కూడలిలో నిర్మిస్తున్న విద్యుత్ సబ్​స్టేషన్​కు తూర్పు ఎమ్మెల్యే నరేందర్​తో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు భూమి పూజ చేశారు. విద్యుత్ వాడకంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్​గా ఉందని వివరించారు.

minister errabelli dayakar rao response on agriculture bill

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లుతో పాటు విద్యుత్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తుందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ శాఖలను ప్రైవేటీకరణ చేస్తే తీవ్ర నష్టం వాటిల్లుతుందని వ్యాఖ్యానించిన మంత్రి... విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్​ చేశారు.

minister errabelli dayakar rao response on agriculture bill
'విద్యుత్​ వాడకంలో దేశంలోనే తెలంగాణ నంబర్​ వన్​'

ఈ నూతన చట్టాలను సీఎం కేసీఆర్ వ్యతిరేకిస్తున్నారని... వీటిని అడ్డుకునేందుకు ప్రజల తోడ్పాటు ఎంతో అవసరమని అన్నారు. వరంగల్ పోచమ్మ మైదానం కూడలిలో నిర్మిస్తున్న విద్యుత్ సబ్​స్టేషన్​కు తూర్పు ఎమ్మెల్యే నరేందర్​తో కలిసి మంత్రి భూమి పూజ చేశారు. విద్యుత్ వాడకంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్​గా ఉందని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగితే విద్యుత్ సంక్షోభం ఏర్పడుతుందన్న ఆంధ్ర నాయకులకు... సీఎం కేసీఆర్ రైతుల కోసం అందిస్తున్న నిరంతర విద్యుత్ చెంపపెట్టు లాంటి సమాధానమని మంత్రి తెలిపారు.

ఇదీ చూడండి: అమానుషం: బాలికపై పైశాచికం... హత్యాచారయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.