ETV Bharat / city

ఆడపడుచుల గౌరవాన్ని పెంచేందుకే బతుకమ్మ చీరలు : మంత్రి ఎర్రబెల్లి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతమైన ఉద్ధేశ్యంతో ఆడపడుచులకు బతుకమ్మ చీరలు అందిస్తున్నదని.. పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు అన్నారు. బతుకమ్మ చీరల పంపిణీ మహిళల గౌరవాన్ని పెంచే కార్యక్రమం అని వ్యాఖ్యానించారు. వరంగల్​ గ్రామీణ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ఆయన మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.

Minister Errabelli dayakar Rao Distributes Bathukamma Sarees
ఆడపడుచుల గౌరవాన్ని పెంచేందుకే బతుకమ్మ చీరలు : మంత్రి ఎర్రబెల్లి
author img

By

Published : Oct 10, 2020, 2:23 PM IST

తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరలు.. ముఖ్యమంత్రి కేసీఆర్​కు మహిళలపై ఉన్న గౌరవాన్ని తెలియజేస్తుందన్నారు పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు. వరంగల్​ గ్రామీణ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

కేసీఆర్​ ఆడపడుచులకు అందిస్తున్న చీరలకు ప్రత్యేకత ఉందని మంత్రి తెలిపారు. బతుకమ్మ పండుగ నాడు కుటుంబ సభ్యులు ఆడపడుచుకు చీర పెట్టి ఎంత ప్రత్యేకంగా గౌరవిస్తామో.. కేసీఆర్​ కూడా బతుకమ్మ చీరలను అంత ప్రత్యేకంగా భావిస్తారన్నారు. ఎన్టీఆర్​ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన బహుకరించిన శాలువా తనకు ఎంతో ప్రత్యేకమని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. గ్రామాల్లో మహిళా సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు తప్పనిసరిగా బతుకమ్మ చీరలు కట్టుకోవాలని మంత్రి కోరారు.

ఇదీ చదవండి: వైద్యుడిపై వలపు వల వేసి రూ.42 లక్షలకు మోసం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.