ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని దేవాదుల ప్యాకేజీ 6 పనుల పురోగతిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమీక్ష నిర్వహించారు. ఆయా పనులు సాధ్యమైనంత వేగంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. దేవాదుల ప్యాకేజీ 6, పీఎంజీఎస్‌వై రోడ్లు పనుల ప్రగతిపై అధికారులతో ఎర్రబెల్లి సుదీర్ఘంగా చర్చించారు. ఒకవేళ కాంట్రాక్టర్లు నిర్ణీత గడువులో పని పూర్తి చేయలేని పరిస్థితి ఉంటే.. వారి కాంట్రాక్టు రద్దు చేసి, బ్లాక్ లిస్టులో పెట్టాల్సివస్తుందని హెచ్చరించారు.
మైనర్ ఇరిగేషన్ పరిధిలోకి వచ్చే చెక్ డ్యాములు, పీఎంజీఎస్‌వై రోడ్ల నిర్మాణం, గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీలు.. వివిధ గ్రామాల మధ్య లింకు రోడ్ల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలు దెబ్బతినకుండా నిర్ణీత కాలపరిమితిలో పనులు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా దాదాపు తగ్గుముఖం పట్టినందున యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని దిశానిర్ధేశం చేశారు.
ఇవీ చూడండి: మన భవిష్యత్‌ను మనమే నిర్మించుకుందాం: కేటీఆర్