ETV Bharat / city

నోట్లను ఉతికి.. ఇస్త్రీ చేశారు!

అదేంటీ.. బట్టలను కదా ఉతికి, ఆరేసి, ఇస్త్రీ చేసేది. నోట్లను ఉతికి, ఇస్త్రీ చేయడమేంటి అని ఆశ్చర్యపోకండి. కొన్నిసార్లు ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతుంటాయి. తడిచిన నోట్లను ఉతికి, ఇస్త్రీ చేసిన ఈ సంఘటన మేడారంలో జరిగింది.

Medaram hundi counting
Medaram hundi counting
author img

By

Published : Feb 19, 2020, 8:15 PM IST

నోట్లను ఉతికి.. ఇస్త్రీ చేశారు!

నానబెట్టిన ప్యాంటు జేబులో యాభై రూపాయల నోటుంటేనే.. పరుగెత్తుకుంటూ వెళ్లి బకెట్లోంచి ప్యాంటు బయటకు తీస్తాం. పొరపాటున నీళ్లలో నానింది ఐదు వందల రూపాయన నోటు అయితే.. చాలామందికి పై ప్రాణాలు పైనే పోతాయి. కానీ.. అక్కడ ఏకంగా.. నోట్ల కట్టలే నీళ్లలో నానబెట్టారు. అంతేకాదు.. ఆ నీళ్లలో సర్ఫ్ వేసి ఎంచక్కా ఆ నోట్లను ఉతికి, ఇస్త్రీ చేసి ఆరబెట్టారు. ఏముందీ.. ఆ నోట్లు ప్లాస్టిక్​వో, లేదంటే.. వాటర్ ప్రూఫ్ నోట్లు కావొచ్చు అనుకుంటున్నారేమో! అస్సలు కాదు. అవి అచ్చంగా ఒరిజినల్ నోట్లే. పది, ఇరవై, యాభై, వంద, ఐదు వందల రూపాయల నోట్లు. అసలేంటి మ్యాటర్ అని ఆలోచిస్తున్నారా..? ఎక్కువ ఆలోచించకండి. ఆ వివరాలు కూడా మేమే చెప్తాం.

ఈ వీడియో చూడండి. ఎంచక్కా నోట్లు సర్ఫ్ నీళ్లలో నానబెట్టి కడుగుతున్నారో! కడగడం మాత్రమే కాదు.. ముడతలు పోయేలా.. ఇస్త్రీ కూడా చేశారు. మేడారం జాతరలో సమ్మక్క, సారక్కలకు భక్తులు సమర్పించిన కానుకలు, నోట్లు, బియ్యం అకాల వర్షానికి తడిసి ముద్దయ్యాయి. కనీసం హుండీలు తొలగించే టైమ్ కూడా లేకపోవడంతో హుండీలోని డబ్బులు కూడా తడిసిపోయాయి.

హుండీ లెక్కింపు కోసం హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపానికి మేడారం హుండీలను తరలించారు. తీరా తెరిచి చూస్తే.. నోట్లన్నీ తడిసి బూజు పట్టిపోయాయి. అప్పటికప్పుడు హుండీలన్ని గుమ్మరించి చూస్తే.. దాదాపు అన్నీ హుండీల్లో ఇదే పరిస్థితి. దీంతో అధికారులు.. నాని, బూజు పట్టిన నోట్లను సర్ఫ్ నీళ్లలో నానబెట్టి శుభ్రం చేస్తున్నారు. తడిసిన నోట్లు పాడైపోకుండా వెంటనే ఇస్త్రీ చేస్తున్నారు. ఇప్పటికీ పూర్తయిన హుండీ లెక్కింపు ప్రకారం రూ.10కోట్లు భక్తులు కానుకల రూపంలో సమర్పించుకున్నారు. ఇంకా లెక్కించాల్సిన హుండీలు, బంగారు ఆభరణాలు ఉన్నాయి. మరో రెండు మూడు రోజుల్లో హుండీల లెక్కింపు పూర్తి చేసి ఈ సంవత్సరం మేడారం హుండీల ఆదాయం ప్రకటిస్తామంటున్నారు అధికారులు.

ఇవీ చూడండి: 'వారి గాథలు వినడం కాదు... మనమే చరిత్ర సృష్టించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.