కరోనా దెబ్బతో పెళ్లి సందడి కరవైంది. సకుటుంబ సపరివార సమేతంగా రావాలంటూ ఆహ్వానం పంపినా చాలా మంది శుభకార్యాలకు గైర్హాజరవుతున్నారు. తప్పని పరిస్థితుల్లో మాత్రమే హాజరవుతున్నారు. వధూవరులు కూడా ముఖ్యులు మాత్రమే వస్తే చాలని భావిస్తున్నారు. ఫలితంగా దాదాపు సగం మండపాలు ఖాళీగానే కనిపిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇవాళ 700 పెళ్లిళ్లు జరిగితే... ఎక్కడా 200 మంది కూడా కనిపించలేదు. వచ్చినా త్వరత్వరగా ఆశీర్వదించి వెళ్లిపోతున్నారు. రాలేకపోయినవారు చరవాణుల్లో శుభాకాంక్షలు చెబుతున్నారు.
కొంతమంది మాస్కులు, శానిటైజర్లతో తగు జాగ్రత్తలు తీసుకుంటూ హాజరవుతున్నారు. గతంతో పోలిస్తే.. కరోనా వైరస్‌పై ప్రజల్లో అవగాహన పెరిగింది. అయిప్పటికీ ఇది సరిపోదని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే రెండు, మూడు వారాలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కరోనాను తరిమికొట్టేందుకు పౌరులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. సాధ్యమైనంత వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, ఇతరులకు దూరంగా ఉండాలని అన్నారు.
ఇదీ చూడండి: దేశంలో కరోనాకు మరొకరు బలి- 4కు చేరిన మృతులు