ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా లాక్‌డౌన్ కట్టుదిట్టంగా కొనసాగుతోంది. ఎక్కువ శాతం ప్రజలు ఇళ్లకే పరిమతమయ్యారు. నిత్యావసర వస్తువులను కొనుగోలు కోసం మాత్రమే ప్రజలు బయటకు వస్తున్నారు. అనవసరంగా బయట తిరిగేవారిని పోలీసులు మందలిస్తున్నారు. ప్రధాన రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. హన్మకొండలో వివిధ చోట్ల చెక్‌పోస్టులు పెట్టి వాహనాలను అడ్డుకుంటున్నారు.
ఇదీ చూడండి: ఆపరేషన్ మర్కజ్: ప్రతి రాష్ట్రంలోనూ వారి కోసం వేట