ETV Bharat / city

కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం రెండో విడత కౌన్సెలింగ్​ - కాళోజీ విశ్వవిద్యాలయంలో ప్రవేశాలు

రాష్ట్రంలోని పీజీ మెడికల్, డెంటల్ కోర్సుల్లో రెండో విడత ప్రవేశాలకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్​ జారీ చేసింది. ఈనెల 2, 3 తేదీల్లో వెబ్​ కౌన్సెలింగ్​ నిర్వహించనున్నారు.

kaloji university
కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం రెండో విడత కౌన్సెలింగ్​
author img

By

Published : Jun 1, 2020, 7:50 PM IST

రాష్ట్రంలోని పీజీ మెడికల్, డెంటల్ కోర్సుల్లో రెండో విడత ప్రవేశాలకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్​ విడుదల చేసింది. మంగళవారం, బుధవారం వెబ్​ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని మెడికల్, డెంటల్ కళాశాలకు కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీచేయనున్నారు. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం సాయంత్రం 7 గంటల వరకు ప్రాధాన్యత క్రమంలో కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు రెండో విడత వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనాలని విశ్వవిద్యాలయం అధికారులు పేర్కొన్నారు. లాక్​డౌన్ దృష్ట్యా తొలివిడత కౌన్సెలింగ్‌లో సీటు కేటాయించినా.. హాజరుకాని అభ్యర్థులకు రెండో విడత వెబ్ కౌన్సెలింగ్‌కు అనుమతిస్తామని తెలిపారు. అందుబాటులో ఉన్న సీట్ల వివరాలను, పీడబ్ల్యూడీ అర్హుల జాబితాను విశ్వవిద్యాలయం వెబ్​సైట్ www.knruhs.telangana.gov.in చూడవచ్చని సూచించారు.

ఇవీచూడండి: వర్సిటీల ప్రైవేటీకరణకు ప్రభుత్వ కుట్ర: భట్టి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.