కన్వీనర్ కోటాలో ఆయుష్ మెడికల్ సీట్ల భర్తీకీ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్ కోటాలో బీఐఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్, బీఎన్వైసీ ప్రవేశాలకు దరఖాస్తు కోరుతూ యూనివర్శిటీ నోటిఫికేషన్ వెలువరించింది.
నీట్లో అర్హత సాధించిన అభ్యర్ధులు ఇవాళ ఉదయం 8 గంటల నుంచి 20వ తేదీ రాత్రి 8 గంటల వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. నిర్దేశిత దరఖాస్తు పూర్తి చేసి, సంబంధిత సర్టిఫికెట్లు స్కాన్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: 300కి పైగా విద్యార్థులు ఉంటే షిప్టు విధానం.. విద్యా శాఖ మార్గదర్శకాలు