ఆరో విడత హరితహారంలో భాగంగా వరంగల్ జాతీయ సాంకేతిక విద్యాసంస్థ నిట్లో అధ్యాపకులు, సిబ్బంది వారి కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. గతేడాది మియావాకి పద్ధతిలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి పచ్చదనాన్ని సంతరించుకున్నాయని అధ్యాపకులు తెలిపారు.
ప్రాంగణంలో వృక్ష సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల సీతాకోక చిలుకలు, పక్షులతో కిలకిలలాడుతోందన్నారు. గతేడాది రెండు వేల మొక్కలు నాటామని, ఈ ఏడాది కూడా అదే స్ఫూర్తితో ప్రతి శనివారం ప్రాంగణంలో మొక్కలు నాటుతున్నామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ గ్రామీణ జిల్లా కలెక్టర్ హరిత, మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి, జిల్లా అటవీశాఖ అధికారి ఎంజే అక్బర్, నిట్ సంచాలకుడు ఎన్వీ రమణరావు పాల్గొన్నారు.