ఫిబ్రవరి 5 నుంచి 8 తేదీ వరకు మేడారం సమ్మక సారలమ్మ జాతర నిర్వహించనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ మసాబ్ ట్యాంక్ లోని డీఎస్ఎస్ భవణ్ లో మేడారం జాతర ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో మంత్రి సత్యవతి రాఠోడ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జాతర పనులు యుద్ద ప్రాతిపాదికన జరుగుతున్నాయని.. డిసెంబర్ నెల చివరి నాటికి పనులు పూర్తి చేస్తామన్నారు.
"దేశంలోనీ గిరిజన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను జాతరకు ఆహ్వానించనున్నారు. మూడు రోజుల్లో కోటిన్నర మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది జాతర కోసం ప్రభుత్వం 75 కోట్ల రూపాయలు కేటాయించింది"
అద్భుతంగా తీర్చిదిద్దుతాం
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రముఖ పర్యటక, పుణ్యక్షేత్రాలకు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని ప్రదేశాలను కూడా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. కేంద్ర మంత్రులను కలిసి సమ్మక్క జాతరను జాతీయ పండుగగా చేయాలని మంత్రి సత్యవతి కోరుతానన్నారు. అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.