తమకు రక్షణ కల్పించాలంటూ మూడు రోజుల క్రితం హత్య గురైన చాంద్‌పాషా కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. ఖలీల్ పిల్లలతో పాటు చాంద్‌పాషా కూతురు, బంధువులు వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషిని కలిసేందుకు కార్యాలయానికి వెళ్లారు. పోలీసులు అడ్డుకోవటంతో మీడియాతో తమ బాధ పంచుకున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయంతో బతుకుతున్నామని.. ఎవరు ఎక్కడి నుంచి వచ్చి తమను కూడా చంపేస్తారో తెలియట్లేదని బాధిత కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
3 రోజుల క్రితం వరంగల్ ఎల్బీనగర్లో ఆస్తి కోసం సొంత అన్నావదినలతో పాటు కుటుంబ సభ్యులను అతి కిరాతకంగా చంపిన ఘటన విధితమే. ఈ దాడిలో చాంద్ పాషా, అతడి భార్య సబీరా, బావమరిది ఖలీల్ మృతి చెందగా.. చాంద్ పాషా ఇద్దరు కొడుకులు తీవ్రంగా గాయపడ్డారు. తమకు కూడా ప్రాణ భయం ఉందని.. రక్షణ కల్పించాలని చాంద్ పాషా కూతురు బంధువులు, ఖలీల్ పిల్లలు వేడుకుంటున్నారు.
మాకు దిక్కెవరూ..
"మా నాన్నను ఏ విధంగా చంపారో.. వాళ్ళను కూడా అదే విధంగా చంపాలి. కళ్లలో కారం కొట్టి.. కత్తులతో పొడిచి చంపారు. ఇళ్లంతా రక్తమే. మా నాన్న మా కళ్ల ముందే గిలిగిలా కొట్టుకుని చనిపోయాడు. ఇప్పుడు మాకు దిక్కెవ్వరు. మాకు న్యాయం కావాలి." -ఖలీల్ పిల్లలు
రక్షణ కల్పించండి..
"ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాం. ఎవరు ఎటు నుంచి వచ్చి చంపేస్తారోనని భయమేస్తోంది. ఎలాంటి హక్కుందని ఆస్తి కోసం మా నాన్నను చంపేశారు. ఏం పాపం చేసిందని మా అమ్మను అతి కిరాతంగా పొడిచేశారు. మా మేనమామను ఎందుకు చంపారు. మా తమ్ముళ్లు ఇప్పుడు ప్రాణాలతో పోరాడుతున్నారు. మా పిన్నిని కూడా అరెస్టు చేయాలి. ఆమె ప్రమేయం కూడా ఉంది. వాళ్ల నుంచి మమ్మల్ని రక్షించాలి. మాకు న్యాయం చేయాలి." - రూబీనా, చాంద్‌పాషా కూతురు
సంబంధిత కథనం..