దేవాదుల ఎత్తిపోతల పథకం రిజర్వాయర్ల నుంచి చెరువులకు, పొలాలకు నీటి సరఫరా పకడ్బందీగా జరగాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో జె. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం నుంచి నీటి విడుదల ప్రణాళిక పై సచివాలయంలో సమీక్షించారు. జనగామ జిల్లా పరిషత్ ఛైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, ఆరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, దేవాదుల సీఈ బంగారయ్య, ఎస్ఈ సుధాకర్ రెడ్డితో పాటు వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ జిల్లాల సాగునీటి, పోలీసు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: విద్యుదాఘాతంతో లారీ దగ్ధం... రూ. 25 లక్షల ఆస్తి నష్టం