వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో విద్యుత్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. సంస్థ ప్రైవేటీకరణ యోచనను వ్యతిరేకిస్తూ నక్కలగుట్టలోని విద్యుత్ భవన్ ఎదుట నిరసన చేపట్టారు. పబ్లిక్ సర్వీసులన్నింటిని కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తుందని ఆరోపించారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటుకు ఇస్తే సామాన్య, మధ్య తరగతి ప్రజలు చాలా ఇబ్బందులు పడతారని అన్నారు.
తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఈ ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తామంతా మెరుపు సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా యూపీలో అక్కడి ఉద్యోగులు చేపట్టిన సమ్మెకు సంఘీభావం తెలిపారు.
ఇవీ చూడండి: ఎమ్మెల్సీ, పుర పోరుకు పార్టీలు సిద్ధం