వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఎంసెట్ పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. ఎంసెట్ పరీక్షకు గానూ... నగరంలో 6, నర్సంపేటలో 2 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం 8 పరీక్ష కేంద్రాల్లో 10 వేల 518 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని అధికారులు తెలుపగా... గంట ముందుగానే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు.
ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి సెషన్ జరగ్గా.. రెండవ సెషన్ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు పరీక్ష జరగనుంది. కొవిడ్ నేపథ్యంలో విద్యార్థులను మాస్కులు ధరించి ఉంటేనే లోపలికి పంపిచారు. సామాజిక దూరం పాటించి విద్యార్థులను ఒక్కరిఒక్కరిని లోపలికి పంపించారు.