ETV Bharat / city

pv smruthi vanam: వంగరలో పీవీ స్మృతివనానికి మంత్రుల శంకుస్థాపన

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని పి.వి.స్వగ్రామం వంగరలో ఆయన పేరుతో నిర్మిస్తున్న స్మృతి వనానికి మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు శంకుస్థాపన చేశారు. ఆయన స్వగృహం ఆవరణలో పీవీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

pv
pv
author img

By

Published : Aug 27, 2021, 3:34 PM IST

వంగరలో పీవీ స్మృతివనానికి మంత్రుల శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు శంకుస్థాపన చేశారు. పీవీ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా స్మృతివనం నిర్మించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన పీవీ కుమార్తె ఎమ్మెల్సీ వాణీదేవి భావోద్వేగానికి లోనయ్యారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

ఎన్నో సంస్కరణలకు ఆయనో ఆర్కిటెక్ట్​ అని... పీవీ శతజయంతి ఉత్సవ కమిటీ ఛైర్మన్ కేశవరావు, మంత్రులు కొనియాడారు. వచ్చే ఏడాదినాటికి వంగరను అద్భుత పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి శ్రీనివాస్​గౌడ్​ వెల్లడించారు. వచ్చే 20 ఏళ్లవరకు తెరాసను... అధికారం నుంచి ఎవరూ దూరం చేయలేరన్నారు. ఈ సందర్భంగా వంగరలో రూ.16 కోట్లు వడ్డీ లేని రుణాలు, శ్రీనిధి రుణాలను, స్వయం సహాయక సంఘాలకు, లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ఎమ్మెల్యే సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మేము పుట్టిపెరిగిన ఈ ప్రాంతమంటే చాలా ఇష్టం. కానీ చాలా కారణాల వల్ల ఈ ప్రాంతానికి కొన్నాళ్లుగా దురమయ్యాం. ఎర్రకోట మీద జెండా ఎగురవేసిన పీవీ గారి గురించి భావితరాలకు తెలియాలంటే వంగర ప్రాంతాన్ని అంతలా అభివృద్ధి చేసుకోవాలి - వాణీదేవి, ఎమ్మెల్సీ

పీవీ చెయ్యని సంస్కరణ లేదు. ఆయన గురించి పుస్తకం రాద్దామనుకున్నప్పడు ఆర్కిటెక్ట్​ ఆఫ్​ మోడ్రన్​ రిఫార్మ్స్​ అనే పేరు సరిపోతుంది. దేశంలో ఎన్నైతే సంస్కరణలు జరిగాయో... ప్రపంచంలో జరుగుతున్నాయో అన్నిటికీ ఆయనొక ఆర్కిటెక్ట్​, కె.కేశవరావు, పీవీ శతజయంతి ఉత్సవ కమిటీ ఛైర్మన్​

ఈ దేశాన్ని ఐదేళ్ల పాటు... మైనార్టీలో ఉన్నా మెజారిటీ ప్రభుత్వంలా పాలించి ఎన్నో సంస్కరణలు తెచ్చిన పీవీ గారి గొప్పతనం వర్ణించలేనిది. వంగరలో పేదలకు భూములిచ్చి భూసంస్కరణలకు నాంది పలికిన ప్రాంతం ఇది. - శ్రీనివాస్​ గౌడ్​, మంత్రి

ఇదీ చూడండి: CM KCR REVIEW: దళిత బంధుపై ముగిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.