ETV Bharat / city

టీఎస్‌బీపాస్‌ ద్వారా మాత్రమే నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలి: కేటీఆర్‌

వరంగల్​, హనుమకొండ జిల్లాల్లో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్​... జిల్లాల అభివృద్ధిపై సమీక్షించారు. అన్ని పట్టణాల్లో మాస్టర్ ప్లాన్ పూర్తి కావాలని.. డిజిటల్ డోర్ నంబరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని అన్నారు. పేదలకు రూపాయి నల్లా కనెక్షన్ ఇవ్వాలని పేర్కొన్నారు.

KTR
KTR
author img

By

Published : Apr 20, 2022, 7:41 PM IST

టీఎస్‌ బీ-పాస్‌ ద్వారా మాత్రమే నిర్మాణాలకు అనుమతివ్వాలని... లేదంటే కఠినచర్యలుంటాయని పురపాలక మంత్రి కేటీఆర్​ స్పష్టం చేశారు. ప్రతీ మున్సిపాల్టీలో వైకుంఠధామంతో పాటు సమీకృత మార్కెట్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మానవవ్యర్థాల శుద్ధీకరణ ప్లాంట్‌ ఏర్పాటుతో పాటు వంద శాతం అన్ని ఇళ్లకు రూపాయికే నల్లా కనెక్షన్‌ ఇవ్వాలని అన్నారు. హనుమకొండ, వరంగల్‌ జిల్లా అభివృద్ధిపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులకు పురపాలక మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.

అన్ని పట్టణాల్లో మాస్టర్ ప్లాన్ పూర్తి కావాలని కేటీఆర్ స్పష్టం చేశారు. డిజిటల్ డోర్ నంబరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని చెప్పారు. ప్రతీ మున్సిపాల్టీలో వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మించాలని తెలిపారు. గ్రీన్ బడ్జెట్​ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆధునికమైన దోబీ ఘాట్​ నిర్మాణం చేపట్టాలని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్​తో పాటు స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి : 'కేంద్రంలో మోదీ గ్యాస్​ ధర పెంచితే.. ఇక్కడ మేం తగ్గిస్తున్నాం'

అప్పటివరకు పెళ్లిలో సరదా సరదాగా.. కాసేపటికే ఆరుగురు శవాలై...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.