palakurthy: జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో వంద కోట్ల రూపాయలతో కొత్త రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ మేరకు సీఆర్ఆర్ ప్లాన్ కింద రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 50 కోట్లు, వచ్చే ఆర్థికసంవత్సరంలో మరో 50 కోట్ల రూపాయల వ్యయంతో రోడ్ల నిర్మాణం జరగనుంది. 2021-22లో 100.53 కిలోమీటర్ల మేర 45 రహదార్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. 2022-23లో 64.42 కిలోమీటర్ల మేర 22 రహదార్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చదవండి:CM KCR Jangaon Tour Speech: జనగామకు సీఎం కేసీఆర్ వరాలు... అవేంటంటే..?!