ఆత్మ నిర్భర్ ద్వారా చేపట్టే కార్యక్రమాలు రైతుకు చేరేలా ప్రణాళికలు రూపొందించాలని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అన్నారు. రైతులకు ప్రయోజనం పొందేలా గ్రామస్థాయిలో వారి అవసరాలు సేకరించి.. అందులో ప్రాధాన్యత అంశాల ప్రకారం ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయంలో కొత్త పద్ధతులను నేర్చుకునేలా ఇతర ప్రభుత్వ పథకాలతో కన్జర్వేషన్ చేస్తే ప్రయోజనం ఉంటుందని కలెక్టర్ సూచించారు.
మెకనైజేషన్ ద్వారా రైతులు కొత్త సాంకేతికతను నేర్చుకునే విధంగా వారిని తీర్చిదిద్దాలన్నారు. రసాయనిక ఎరువులను ఎక్కువగా వినియోగించకుండా సేంద్రీయ వ్యవసాయం చేయాల్సిన అవసరముందన్నారు. పరిస్థితులకు అనుగుణంగా నూతన వ్యవసాయ విధానాన్ని రైతులు అలవరచుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఇదీ చదవండి: ఇకనుంచి తహసీల్దార్లే జాయింట్ రిజిస్ట్రార్‌లు: కేసీఆర్