ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా విజయ దశమి రోజున రైతు వేదికలు ప్రారంభమవుతాయని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. సీఎం వెసులుబాటుని బట్టి ఏదో ఒక చోటు నుంచి ప్రారంభోత్సవం ఉంటుందన్నారు. వరంగల్లోని తన క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో భేటీ అయిన మంత్రి.. రైతు వేదికల ప్రారంభోత్సవాలపై ఎమ్మెల్యేలకు పలు సూచనలు చేశారు.
దసరా నాటికి రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని మంత్రి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.572 కోట్ల వ్యయంతో 2,601 రైతు వేదికలను ప్రభుత్వం నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 74 రైతు వేదికలు నిర్మాణంలో ఉన్నాయన్నారు.
ఇవీచూడండి: 'మారుమూల ప్రాంతాల రైతులు సైతం నేరుగా సీఎంతో మాట్లాడొచ్చు'