ETV Bharat / city

ఎమ్మెల్యే దాతృత్వం... యువతికి డైరీ స్టాల్​ పెట్టించిన చీఫ్​ విప్​ - mla help to women

సాయం కోరి వచ్చిన యువతికి ప్రభుత్వ చీఫ్​ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్​భాస్కర్ కొండంత భరోసా ఇచ్చారు. నూతనంగా నిర్మించిన స్ట్రీట్ వెండింగ్ జోన్​లో సొంత ఖర్చుతో విజయ డైరీ స్టాల్​ని ఏర్పాటు చేయించారు.

chief Vip  vinay bhasker helped to women
chief Vip vinay bhasker helped to women
author img

By

Published : Oct 3, 2020, 8:07 AM IST

హన్మకొండకు చెందిన కాముని మౌనిక ఎంబీఏ పూర్తి చేసింది. కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తనకు సాయం అందించాల్సిందిగా ఎమ్మెల్యే వినయ్​భాస్కర్​ను కలిసి విజ్ఞప్తి చేసింది. వెంటనే స్పందించిన వినయ్​భాస్కర్ యువతికి స్వయం ఉపాధి కల్పించడం మేలని భావించి విజయ డైరీ ప్రొడక్ట్స్​ స్టాల్ ఏర్పాటు చేయించారు.

chief Vip  vinay bhasker helped to women
ఎమ్మెల్యే దాతృత్వం... యువతికి డైరీ స్టాల్​ పెట్టించిన చీఫ్​ విప్​

స్టాల్ ఏర్పాటుకు అయ్యే మొత్తం వ్యయాన్ని వినయ భాస్కర్ వ్యక్తిగతంగా అందజేశారు. గాంధీ జయంతి సందర్భంగా మెఫ్మా ఆధ్వర్యంలో హన్మకొండలో ప్రారంభించిన స్ట్రీట్ వెండింగ్ జోన్ ప్రారంభ కార్యక్రమంలో మేయర్, మున్సిపల్ కమిషనర్ చేతుల మీదుగా స్టాల్​ను ప్రారంభింపజేశారు. వినయ్ భాస్కర్ అందించిన చేయూతకు మౌనిక ధన్యవాదాలు తెలిపింది.

ఇదీ చూడండి: వర్షాలకు నీట మునిగిన పంటలు.. బీమా రద్దుతో పెరిగిన కష్టాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.