ETV Bharat / city

తెరాస ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది: కిషన్​రెడ్డి

వరంగల్​ స్మార్ట్​సిటీకి రాష్ట్ర ప్రభుత్వ వాటా ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి ఆరోపించారు. కేంద్ర నిధుల విషయంలో తెరాస సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.

central minister kishan reddy comments on state government on funds issues
తెరాస ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది: కిషన్​రెడ్డి
author img

By

Published : Dec 11, 2020, 4:08 PM IST

కేంద్ర నిధుల ఖర్చు విషయంలో తెరాస ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. వరంగల్‌ స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు, అమృత్‌ తదితర పథకాలపై అధికారులతో కిషన్‌రెడ్డి సమీక్షించారు. వరంగల్‌ స్మార్ట్‌సిటీకి కేంద్రం రూ.2,740 కోట్లు కేటాయించినా రాష్ట్ర ప్రభుత్వ వాటా ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని ఆరోపించారు.

భద్రకాళి చెరువు అభివృద్ధికి కేంద్రం రూ.31 కోట్లు కేటాయించిందన్న కిషన్‌రెడ్డి.. మంచినీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ నిర్వహణకు నిధులు ఇచ్చిందని వివరించారు. వరంగల్‌ నుంచి హైదరాబాద్‌ వరకు జాతీయ రహదారిని సీసీ రోడ్డుగా నిర్మిస్తున్నామని.. తెలంగాణ, వరంగల్‌ అభివృద్ధికి భాజపా ప్రభుత్వం కృషి చేస్తోందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

ఇవీ చూడండి: నిధులు ఇవ్వకపోవడం వల్ల కేఎంసీ ప్రారంభోత్సవం జాప్యం: కిషన్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.