మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం వీరారం చేపల చెరువు వద్ద ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో నలుగురికి గాయాలయ్యాయి. గ్రామ శివారులోని వీరసముద్రం చెరువులో మత్య్సకారులు చేపల పెంపకం చేపట్టారు. మత్స్యకారులు చేపలు పడుతున్న సమయంలో పలు గిరిజన తండాలకు చెందిన వారు వచ్చి చేపలు లూటీ చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో మత్స్యకారులకు ఇతర తండాల నుంచి వచ్చిన వారికి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
ఇరువర్గాలు రాళ్ల దాడికి దిగగా.. నలుగురికి గాయాలైనట్లు గ్రామస్థులు తెలిపారు. గాయపడిన వారిని మరిపెడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు చెరువు వద్దకు చేరుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
ఇవీచూడండి: ధాన్యం సేకరణలో అగ్రస్థానంలో తెలంగాణ: కేటీఆర్