ETV Bharat / city

'గత ప్రభుత్వ హయాంలో విద్యుత్​ రంగం అప్పుల పాలైంది' - టీడీపీపై మంత్రి బాలినేని విమర్శలు

గత ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల విద్యుత్ శాఖ అప్పుల ఊబిలో చిక్కుకుందని ఆ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి ఆరోపించారు. ఆ పరిస్థితుల నుంచి విద్యుత్​ రంగాన్ని గట్టెక్కించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. విద్యుత్ ​శాఖలో​ ఉద్యోగులు పొందిన వారికి నియామక పత్రాలు అందించే ఓ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లితో కలిసి ఆయన పాల్గొన్నారు.

ministers-issued-aee-posting-orders-in-vijayawada
'గత ప్రభుత్వం విద్యుత్​ రంగాన్ని అప్పుల పాలు చేసింది'
author img

By

Published : Dec 2, 2019, 6:57 PM IST

ఏఈఈ ఉద్యోగులకు నియామక పత్రాలు పంపిణీ కార్యక్రమం
గత ప్రభుత్వం విద్యుత్​ శాఖను అప్పుల పాలు చేసిందని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి విమర్శించారు. ఇటీవల విద్యుత్​ శాఖలో సహాయ కార్యనిర్వాహక ఇంజినీర్లు(ఏఈఈ)గా ఎంపికైన వారికి విజయవాడ శేషసాయి కల్యాణ మండపంలో నిమాయక పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బాలినేని శ్రీనివాసులరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ప్రభుత్వ ధనం ఆదా

విద్యుత్ రంగంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే విద్యుత్​ శాఖ అప్పుల నుంచి కోలుకోలేని పరిస్థితుల్లో ఉందని, ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు మంత్రి బాలినేని తెలిపారు. రివర్స్ టెండరింగ్, పీపీఏలు రద్దు చేయడం ద్వారా ప్రభుత్వ ధనాన్ని ఆదా చేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యుత్​ శాఖకు ఇప్పటికే 8 వేల మంది సిబ్బందిని గ్రామ సచివాలయాలకు అనుబంధంగా ఎంపిక చేశామని, ఇప్పుడు సహాయ కార్యనిర్వాహక ఇంజినీర్ల ద్వారా మరింత మెరుగైన సేవలు అందుతాయని మంత్రి బాలినేని విశ్వాసం వ్యక్తం చేశారు. సంక్షేమం, అభివృద్ధి సమతూకంతో ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి నడిపిస్తున్నారని మంత్రి వెల్లంపల్లి కొనియాడారు.

ఇదీ చదవండి:

'4 నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు సీఎం జగన్ ఘనత'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.