రాహుల్ జహీరాబాద్ సభ రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాన హామీ కనీస ఆదాయ పథకాన్ని ప్రకటించిన తరువాత తెలంగాణలో పాల్గొన్న మొదటి సభ కావటం వల్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకరోజు ముందే హైదరాబాద్ చేరుకున్న రాహుల్... స్థానిక రాజకీయ పరిస్థితులు, ప్రజల ఆకాంక్షలు, హామీలపై రాష్ట్ర నేతలతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఎమ్మెల్సీ ఫలితాల ఉత్సాహానికి రాహుల్ పర్యటన ఓట్లు కురిపిస్తుందని ఆశిస్తున్నారు.
ఇవీ చూడండి:తెలంగాణలో మంత్రులకు లోక్సభ పరీక్ష...!