దేశం గర్వించే విధంగా పలు భాషల్లో దాదాపు 40 వేల పాటలు పాడిన స్వరశిల్పి గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సంస్కృతి సంక్షేమ కమిటీ ఆధ్వర్యంలో ఎస్పీ బాలుకు స్వర నివాళి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు సినీ నటుడు శివారెడ్డి పాల్గొని బాలు చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఎందరో గాయకులకు ఎస్పీ బాలు స్ఫూర్తిగా నిలిచారని నటుడు శివారెడ్డి అన్నారు. కళాకారులు లేకపోయినా బాలు పాడిన పాటలు ప్రజల గుండెల్లో ఎల్లప్పుడూ సజీవంగా ఉంటాయని తెలిపారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కళాకారులు జాతీయ స్థాయిలో తమ ప్రతిభ కనబరుస్తున్నారని.. వారిని ఎమ్మెల్యే అభినందించారు. త్వరలో వారికోసం ఆడిటోరియం భవన నిర్మాణాన్ని చేపడతామని కళాకారులకు కోరుకంటి చందర్ హామీ ఇచ్చారు.
ఇదీ చదవండిః ఎస్పీ బాలుకు సినీ సంగీత కళాకారులు శ్రద్ధాంజలి