Tilak Varma T20 : స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పిన తర్వాత నెం. 3లో ఆడేది ఎవరనే విషయంలో ఇప్పటివరకు కన్ఫ్యూజన్ ఉండేది. అయితే రీసెంట్గా సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు బాది ఔరా అనిపించాడు. ఈ క్రమంలో విరాట్ నెం. 3 స్థానంలో తిలక్ వర్మ సెట్ అవుతాడని టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అభిప్రాయపడ్డాడు.
యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ నెం. 3లో బ్యాటింగ్ చేయడానికి కచ్చితంగా సరిపోతాడని సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించాడు. భవిష్యత్తులో కూడా అదే స్థానంలో తిలక్ వర్మ స్థిరంగా రాణించే బాధ్యతను తీసుకోవాలని అభిప్రాయపడ్డాడు. అలాగే విరాట్ కోహ్లీపై కూడా సూర్యకుమార్ యాదవ్ ప్రశంసలు కురిపించాడు.
ఒకప్పుడు వన్ డౌన్ అంటే విరాట్ కోహ్లీనే గుర్తొచ్చేవాడు. వన్ డౌన్లో బరిలో దిగిన విరాట్ నిలకడగా రాణించాడు. ఈ క్రమంలోనే జట్టుకు అనేక విజయాలను అందించాడు. అయితే సౌతాఫ్రికా సిరీస్‌లో కెప్టెన్ సూర్యకుమార్‌ను అడిగి మరీ తిలక్ వర్మ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. మిడిలార్డర్లో రావాల్సిన తిలక్ నెం 3లో బ్యాటింగ్ బరిలోకి దిగి విధ్వంసం సృష్టించాడు. దీంతో టీ20ల్లో కోహ్లీ ప్లేస్‌ను తిలక్ వర్మ భర్తీ చేస్తాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. విరాట్ కోహ్లీ వన్ డౌన్ స్థానానికి తిలక్ పక్కాగా సెట్ అవుతాడని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Unbelievable feeling! Special, special day. Congratulations to the entire team 🇮🇳❤️❤️ pic.twitter.com/nhlUikxGOu
— Tilak Varma (@TilakV9) November 15, 2024
విరాట్ రికార్డ్ బ్రేక్ : సౌతాఫ్రికా సిరీస్‌లో తిలక్ వర్మ అదిరే ప్రదర్శన చేశాడు. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో ఏకంగా 198 స్ట్రైక్ రేట్‌తో 280 పరుగులు బాదాడు. అందులో రెండు సెంచరీలు ఉన్నాయి. దీంతో ఓ టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు బాదిన బ్యాటర్‌గా తిలక్ వర్మ రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (231 పరుగులు vs ఇంగ్లాండ్) రికార్డ్ బ్రేక్ చేశాడు. దీంతో ఈ సిరీస్‌లో తిలక్ 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు' దక్కించుకున్నాడు. కాగా, ఈ సిరీస్‌ను భారత్ 1-3తేడాతో దక్కించుకుంది.