రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో దేవునిపల్లి, చిన్నకల్వల, రెబ్బల్దేవపల్లి, మియాపూర్, చిన్నబొంకూర్, సుగ్లంపల్లి, శాస్త్రినగర్, కనుకుల, రామునిపల్లి, మంచిరామి, తొగర్రాయి, ఐతరాజుపల్లి గ్రామాల్లో సహకార సంఘాలు, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు. రైతులు తమ ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని.. కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధరను పొందాలని ఎమ్మెల్యే దాసరి కోరారు.
ఇదీ చదవండి: తొలి మహిళా మైన్ మేనేజర్‌కు ఎమ్మెల్సీ కవిత అభినందన