ETV Bharat / city

TS Politics: ఈటీవీ భారత్ ప్రత్యేకం... "ధర్మపురి" వారి కుటుంబ కథా చిత్రమ్! - Dharmapuri Sanjay news updates

వాళ్లది ఒకే కుటుంబం.. కానీ జెండాలు మాత్రం మూడు. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. ఆ మూడు జెండాలే రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. మూడు ప్రధాన పార్టీలకు ఆ ముగ్గురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అధికార పార్టీకి ఒకరు దూరంగా ఉంటున్నా.. ఆ పార్టీ ఎంపీగా కొనసాగుతున్నారు. ఇంకొకరు కాషాయ పార్టీలో కీలక నేతగా.. అధికార పార్టీకి కొరకరాని కొయ్యగా మారారు. తాజాగా సొంత గూటికి వెళ్తోన్న మాజీ మేయర్​తో మూడు పార్టీలు ఒకే కుటుంబంలో ఉన్నట్లయింది. అసలు ఎవరిది ఈ ఫ్యామిలీ.. వాళ్ల గురించి తెలుసుకుందాం.

TS Politics
TS Politics
author img

By

Published : Aug 18, 2021, 4:39 PM IST

Updated : Aug 19, 2021, 8:13 AM IST

రాజకీయాల్లో ఎప్పుడు అయినా ఎవరి అవసరాలు వారికి ఉంటాయి. ఒకే కుటుంబానికి చెందిన వారు వేర్వేరు పార్టీల్లో ఉండటం కామన్. అయితే ఓ కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు.. మూడు పార్టీల్లో ఉన్నారు. ఆ కుటుంబం ఎవరిదో కాదు.. ధర్మపురి ఫ్యామిలీ(dharmapuri family).

ముగ్గురు నేతలు.. మూడు పార్టీలు.. ఒకే కుటుంబం

ధర్మపురి ఫ్యామిలీ ప్రత్యేకం

నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో ధర్మపురి ఫ్యామిలీ(Dharmapuri Family)కి ప్రత్యేక గుర్తింపు ఉంది. వైఎస్ఆర్​ (Y. S. Rajasekhara Reddy) ఉన్నప్పుడు ఆయనే పీసీసీ అధ్యక్షుడిగా (PCC Chief) ఉన్నారు. 2004-2009 ఎన్నికల్లో కాంగ్రెస్​ను (Congress) రెండుసార్లు అధికారంలోకి తీసుకువచ్చారు. రెండు సార్లు పీసీసీ అధ్యక్షునిగా పనిచేసిన శ్రీనివాస్ (D.srinivas).. అప్పట్లో రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. మారిన రాజకీయ పరిణామాలతో ఆయన.. హస్తం పార్టీని వీడి తెరాసలో (TRS) చేరారు. గులాబీ అధినేత కేసీఆర్(KCR).. డీఎస్​కు రాజ్యసభ పదవి ఇచ్చారు.

వేర్వేరు పార్టీల్లో కుమారులు

తండ్రితో పాటు పెద్ద కుమారుడు నిజామాబాద్ నగర తొలి మేయర్ ధర్మపురి సంజయ్ (Dharmapuri Sanjay).. గులాబీ కండువా (TRS) కప్పుకున్నారు. రెండో కుమారుడు ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) మాత్రం తండ్రి వెంట నడవక.. కాషాయ గూటికి (BJP) చేరారు. అర్వింద్ (Dharmapuri Arvind) భాజపాలో చేరడంతో అధికార పార్టీలో ఉన్న డీఎస్​కు(D.srinivas) ఇబ్బందులు మొదలయ్యాయి. పార్టీ అధినేతకు.. డీఎస్​కు మధ్య అంతరం ఏర్పడింది. అప్పటి నుంచి పార్టీ ఎంపీగా ఉన్నా.. పార్టీ వ్యవహారాల్లో మాత్రం అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు డీఎస్.

ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ఎంపీలు

ఇక గత పార్లమెంట్ ఎన్నికల్లో (parliament election) ధర్మపురి అర్వింద్ ఎంపీగా (MP) గెలిచారు. ఒకే ఇంటి నుంచి ఇద్దరు ఎంపీలున్న కుటుంబాలు దేశంలో చాలా తక్కువ. అలాంటి అరుదైన ఘనత డి.శ్రీనివాస్ (Dharmapuri Srinivas Family) కుటుంబానికి దక్కింది. తాజాగా మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ గులాబీ పార్టీని వీడి తిరిగి కాంగ్రెస్​లో (Congress) చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్​తో (pcc chief revanth reddy) భేటి కావడం అందుకు బలం చేకూర్చింది. ఇలా ఒకే కుటుంబం నుంచి ముగ్గురు నాయకులు మూడు పార్టీల్లో ఉండటంపై ఇందూరు రాజకీయాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.

ముగ్గురు నేతలు.. మూడు పార్టీలు

రాష్ట్ర రాజకీయాల్లో మూడు ప్రధాన పార్టీలైన తెరాస, కాంగ్రెస్, భాజపా మధ్య ఢీ అంటే ఢీ అనే పాలిటిక్స్ కొనసాగుతుంటే.. ఆ మూడు పార్టీల్లో ధర్మపురి కుటుంబం(Dharmapuri Family) నుంచి ముగ్గురు నేతలు జిల్లాలో కీలకంగా వ్యవహరిస్తుండటం ఆసక్తికరంగా మారింది. ధర్మపురి శ్రీనివాస్ (Dharmapuri Srinivas)తెరాస రాజ్యసభ సభ్యునిగా (TRS MP) కొనసాగుతున్నా.. ఆయన పెద్ద కుమారుడితో కలిసి కాంగ్రెస్​లో చేరుతారా.. చిన్న కుమారుడి కోసం కాషాయ కండువా కప్పుకుంటారా లేదా ఇద్దరు కుమారుల రాజకీయ భవిష్యత్ కోసం తెరవెనుక మంత్రాంగం నడిపిస్తారా అన్న చర్చ ఇందూరు రాజకీయాల్లో జరుగుతుంది. ముగ్గురు నేతలు మూడు పార్టీల్లో ఉండటం వల్ల డీఎస్ అనుచరులు సైతం ఎవరి వెంట నడవాలో తెలియక సతమతం అవుతున్నారు. డీఎస్ రాజకీయ నిశ్శబ్దం వహిస్తే.. సంజయ్ యాక్టివ్​గా మారి అర్బన్​పై గురి పెట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ధర్మపురి అర్వింద్ సైతం వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక అసెంబ్లీ నుంచి పోటీ చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అర్వింద్ సైతం అర్బన్ నుంచి బరిలోకి దిగితే.. సోదరుల మధ్య పోరు తప్పదని భావిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది ఉత్కంఠగా మారిందని చెబుతున్నారు.

రాష్ట్ర రాజకీయాల్లో చర్చ

రాష్ట్రంలో ప్రస్తుతం మూడు ప్రధాన పార్టీల్లో ఉన్న డీఎస్, ఆయన కుమారులు... పార్టీలకు అనుగుణంగా పని చేస్తూ ఆ స్థాయిలోనే పోరాటం చేస్తారా..? లేదంటే ఒకరిపై మరొకరు పోటీ చేసే పరిస్థితి వస్తుందా...? డీఎస్ ఏదో కుమారుడు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలో చేరుతారా..? అన్న విషయాలు మాత్రం రానున్న రోజుల్లో తేలాల్సిందే.

ఇవీ చూడండి:

Last Updated : Aug 19, 2021, 8:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.