కామారెడ్డి జిల్లా ఆస్పత్రి వైద్యుల తీరు విమర్శలకు తావిస్తోంది. సరైన సమయంలో స్పందించడం లేదని దవాఖానాకు వచ్చిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గర్భిణీని పట్టించుకోకపోవడం వల్ల పసికందు మృతి చెందిందని బాధిత కుటుంబం గోడు వెల్లబోసుకుంది.
దోమకొండ మండలం చింతామన్‌పల్లికి చెందిన చామంతి పురుడు కోసం తల్లిగారింటికి వచ్చారు. నిన్న ఉదయం పురిటి నొప్పులు ఎక్కువకాగా జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చారు. తీవ్రరక్తస్రావం అవుతుందని చెప్పినా వైద్యుల నుంచి స్పందన కరువైందని బాధిత కుటుంబం వాపోయింది. శుక్రవారం తెల్లవారుజామున ప్రసవం చేయగా పుట్టిన కాసేపటికే శిశువు మృతి చెందాడని.. ఇందుకు ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఇవీ చూడండి: నాకోసం ఎదురు చూసేవాళ్లే గుర్తొస్తుంటారు..!