ఆమె మూడు ప్రభుత్వోద్యోగాలు పొందిన ప్రతిభాశాలి. దురదృష్టవశాత్తు కరోనా బారిన పడి శుక్రవారం కన్నుమూశారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మజివాడికి చెందిన జాదవ్ విజయ(27) తాడ్వాయి తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సదాశివనగర్ మండలం మల్లుపేట గ్రామ పంచాయతీ జూనియర్ కార్యదర్శిగా రెండేళ్లు విధులు నిర్వహించారు. తర్వాత అటవీ బీట్ అధికారిణిగా ఎంపికైనా ఉద్యోగంలో చేరలేదు. మూణ్నెల్ల కిందట వెలువడిన గ్రూప్స్ ఫలితాల్లో రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా ఎంపికవడంతో పంచాయతీ కార్యదర్శి పోస్టుకు రాజీనామా చేసి ఆ ఉద్యోగంలో చేరారు.
ఉద్యోగం వస్తే తిరుమల వేంకటేశ్వరుని దర్శించుకోవాలనుకుని... పది రోజుల కిత్రమే విజయ అక్కడికి వెళ్లివచ్చారు. అనంతరం విధుల్లో చేరిన ఆమెకు కరోనా పాజిటివ్‌గా తేలింది. నాలుగు రోజులుగా ఇంట్లోనే చికిత్స తీసుకొంటున్నారు. గురువారం ఆమె కుటుంబసభ్యుల మధ్యే పుట్టినరోజు చేసుకున్నారు. అనంతరం పరిస్థితి విషమించడంతో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మరణించారు.
ఇవీ చూడండి: 'రాబోయే 3 వారాలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి'