ETV Bharat / city

ఆస్తి పన్ను కట్టలేదని సబ్​రిజిస్ట్రార్ కార్యాలయం సీజ్ - పన్ను కట్టలేదని సబ్​రిజిస్ట్రార్ కార్యాలయం సీజ్

SUB REGISTER OFFICE SEIZED IN BODHAN: ఆస్తి పన్ను కట్టలేదని పురపాలక అధికారులు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి తాళం వేశారు. ఈ ఘటన బోధన్​లో చోటుచేసుకుంది. పలుమార్లు నోటీసులు ఇచ్చినా బకాయిలు చెల్లించని కారణంగానే సీజ్​ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

SUB REGISTER OFFICE SEIZED IN BODHAN
సబ్​రిజిస్ట్రార్ కార్యాలయం సీజ్
author img

By

Published : Mar 25, 2022, 6:39 PM IST

SUB REGISTER OFFICE SEIZED IN BODHAN: నిజామాబాద్‌ జిల్లా బోధన్​లో ఆస్తి పన్ను చెల్లించలేదనే కారణంతో... సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి మున్సిపల్‌ అధికారులు తాళం వేశారు. ఆ సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతోంది.

గంటపాటు నిలిచిన రిజిస్ట్రేషన్లు...

పన్ను చెల్లించాలంటూ పలుమార్లు భవన యజమానికి అధికారులు నోటీసులు జారీచేశారు. అయినప్పటికీ స్పందించకపోవటంతో మున్సిపల్‌ అధికారులు అక్కడికి వెళ్లి సీజ్​ చేశారు. దీంతో గంటపాటు రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు మున్సిపల్‌ అధికారులతో మాట్లాడటంతో ఎట్టకేలకు తాళాలు తీశారు.

ఇదీ చదవండి:ఇంటి పన్ను చెల్లించలేదని... ఇంటి ముందే డంపింగ్ యార్డ్..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.