పట్టణ ప్రగతిపై అధికారులు, కార్పొరేటర్లతో నిజామాబాద్ మేయర్ నీతూ కిరణ్ సమావేశం నిర్వహించారు. అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నగరాభివృద్ధి కోసం 15మందితో వార్డు కమిటీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మేయర్ కోరారు. ప్రతి డివిజన్లో సమస్యలపై కార్పొరేటర్లకు అవగాహన ఉండాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం బాధ్యతతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జితేష్ వీ పటేల్ పాల్గొన్నారు.
ఇదీ చదవండిః అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేయాలి: వెంకయ్యనాయుడు