నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రజావాణి కార్యక్రమానికి అర్జీలు వెల్లువెత్తాయి. కలెక్టరేట్లోని ప్రగతి భవన్లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి ఫిర్యాదుదారులు తరలివచ్చారు. ఎక్కువగా డబుల్ బెడ్రూంలు అందించాలని ఫిర్యాదులు వచ్చాయి.
భూ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. బాధితులు ఫిర్యాదు చేశారు. వాటన్నింటిని పరిశీలించిన అదనపు కలెక్టర్ చంద్రశేఖర్.. సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: 'కేసీఆర్ పుట్టిన రోజున రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు'