ETV Bharat / city

కలిసిరాని యాసంగి పంటలు.. బోర్లు వట్టిపోయి రైతుల ఆవేదన - ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు

వానాకాలం మురిపిస్తే.. యాసంగి ఏడిపిస్తోంది. సమృద్ధిగా వర్షాలు పడ్డాయని వరి సాగు చేస్తే మండుతున్న ఎండలకు బోర్లు వట్టిపోయి వేలాది ఎకరాల్లో పైరు ఎండిపోయింది. చేతికందాల్సిన పంటలు కళ్లముందే ఎర్రబారుతుంటే రైతులు కన్నీరు పెడుతున్నారు. భూగర్భజలాలు అడుగంటి భూమి నెర్రెలు బారుతోంది. పెట్టుబడి సైతం తిరిగి రాని దుస్థితి నెలకొందని ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా రైతులు వాపోతున్నారు.

కలిసిరాని యాసంగి పంటలు.. బోర్లు వట్టిపోయి రైతుల ఆవేదన
nizamabad farmers facing huge water problems for crop
author img

By

Published : Apr 9, 2021, 4:14 AM IST

కలిసిరాని యాసంగి పంటలు.. బోర్లు వట్టిపోయి రైతుల ఆవేదన

వానాకాలంలో సమృద్ధిగా కురిసిన వర్షాలతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులు యాసంగిలో అంచనాలకు మించి వరి సాగు చేసారు. జిల్లాలో సాధారణం కంటే 151 శాతం సాగు విస్తీర్ణం పెరిగింది. బోర్లపై ఆధారపడి ఎక్కువ మంది వరి పంట సాగు చేశారు. ఎండల ధాటికి భూగర్భ జలాలు పడిపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టు నాలుగేళ్లుగా నిండటం లేదు. గత వానాకాలంలో చేరిన నీటితో వర్షాకాలం పంటలు గట్టెక్కినా యాసంగికి మాత్రం తిప్పలు తప్పటం లేదు. యాసంగి పంటకు వచ్చే సరికి భూగర్భ జలాలు తగ్గిపోయి చాలా చోట్ల బోర్లు వట్టిపోయి యాసంగి పంటల దిగుబడి మీద తీవ్ర ప్రభావం పడుతోంది.

రైతుల ఆవేదన..

యాసంగి ప్రారంభంలో బోర్ల నుంచి నీరు పుష్కలంగా వచ్చింది. రెండో పంటకు ఢోకా లేదని రైతులు ఉత్సాహంతో వరి సాగు చేపట్టారు. మరో నాలుగు తడులు నీళ్లందితే చేతికందే పంట... ప్రస్తుతం సాగునీరు లేక ఎండిపోయింది. ఒక్కో ఎకరానికి 20వేల పెట్టుబడి పెట్టి సాగు చేస్తే భూమిలో పోసినట్టయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు ఒక్కో ఎకరం 15వేలు చెల్లించి కౌలుకు తీసుకుని సాగుచేసినా కన్నీరే మిగిలిందని బాధను వ్యక్తం చేస్తున్నారు.

పడిపోయిన భూగర్భ జలాలు..

30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా మార్చి నాటికే కామారెడ్ది జిల్లాలో భూగర్భ జలం 19 మీటర్లకు పడిపోయింది. నిజామాబాద్ జిల్లాలో 16 మీటర్లకు పడిపోయింది. చాలా ప్రాంతాల్లో 1200 అడుగులకు బోర్లు వేసినా నీరు పడని దుస్థితి నెలకొంది. ఏప్రిల్ మొదటి వారానికే ప్రమాద స్థాయిలో పడిపోగా.. మే లో భానుడి భగభగలకు మరింత క్షీణించే అవకాశం ఉంది . కాల్వలు అందుబాటులో ఉన్న చోట్ల నీరందిస్తే పంటను కాపాడుకుంటామని అన్నదాతలు వేడుకుంటున్నారు.

కనీసం పంటను కోసేందుకు అయ్యే ఖర్చులు తిరిగి వచ్చేలా లేవని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు.

ఇవీ చూడండి: బంగ్లాదేశ్​ ఎయిర్​ ఫోర్స్​, నేవీ చీఫ్​ల​తో నరవణే భేటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.