నిజామాబాద్ జిల్లాలో ఆక్సిజన్ కొరత ఉండకూడదని కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. నగరంలోని దుబ్బ ప్రాంతంలో గల లక్ష్మీప్రసన్న ఆక్సిజన్ ప్లాంట్, డిచ్పల్లి మండలంలోని సుద్దపల్లి శ్రీసాయి ఆక్సిజన్ ప్లాంట్‌ను కలెక్టర్ పరిశీలించారు.
ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని, వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లాలో ఆక్సిజన్ కొరత లేదనే పేరు రావాలని అన్నారు. ఈ ఏజెన్సీ నుంచి మొత్తం టౌన్‌లోని ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరా జరుగుతుందని తెలిపారు. కలెక్టర్ వెంట డ్రగ్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, నోడల్ ఆఫీసర్ ప్రవీణ్ ఉన్నారు.
- ఇదీ చదవండి ప్రేమించట్లేదని యువతిపై కత్తితో దాడి..