నిజామాబాద్ నగరంలోని నెహ్రూ చౌరస్తాలో డీసీపీ అరవింద్ బాబు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దుకాణాలు తనిఖీ చేసి కరోనా నిబంధనలు పాటిస్తున్నారో లేదోనని పరిశీలించారు. రాత్రి కర్ఫ్యూ సందర్భంగా పాటించాల్సిన నిబంధనలు వివరించారు.
కరోనా తీవ్రతరమవుతున్న దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డీసీపీ అరవింద్ బాబు సూచించారు. ప్రతి ఒక్కరు కచ్చితంగా మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని చెప్పారు.
- ఇదీ చదవండి కొవిడ్ బాధితులకు స్టార్ హోటళ్లలో వైద్యం