కామారెడ్డి జిల్లా బాన్సువాడ మార్కెట్ యార్డులో దాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. కరోనా కష్టకాలంలోనూ... రైతు పండించిన పంటను వృథా కాకుండా దాన్యం కొనుగోలుకు సీఎం కేసీఆర్ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. తానూ ఓ రైతునేనని... ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని, ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు.
దుబ్బాక ఉప ఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధిస్తుందని భాస్కర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. భాజపా కార్యకర్తులు, నాయకులు దురుసుగా మాట్లాడటం సమంజసం కాదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ కృష్ణారెడ్డి, మున్సిపాల్ ఛైర్మన్ గంగాధర్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: నాయినికి ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత పరామర్శ