ETV Bharat / city

పెండింగ్​లో ఉన్న పెట్టుబడి సబ్సిడీల మంజూరు: కలెక్టర్ నారాయణరెడ్డి

author img

By

Published : Oct 20, 2020, 10:19 AM IST

పెండింగ్​లో ఉన్న పెట్టుబడి సబ్సిడీలు వెంటనే మంజూరు చేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్​లో 41వ టీఎస్-ఐపాస్ జిల్లా పరిశ్రమల అభివృద్ధి కమిటీతో సమావేశం నిర్వహించారు.

Nizamabad collector Narayana reddy
కలెక్టర్ నారాయణరెడ్డి

జిల్లాలోని పౌల్ట్రీ ఫామ్, నాలా కన్వర్షన్​లతో సహా పెండింగ్​లో ఉన్న అన్ని సబ్సిడీలు.. నిబంధనల ప్రకారం ఉంటే.. వెంటనే వాటిని మంజూరు చేయాలని నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. టీ ప్రైడ్ క్రింద ఎస్సీలకు పెండింగ్​లో ఉన్న 14 రుణాలు, ఎస్టీలకు 24 రుణాలను వెంటనే మంజూరు చేయాలని తెలిపారు. సకాలంలో సమర్పించని రెండు అప్లికేషన్లను తిరస్కరించినట్లు వెల్లడించారు.

వీలైనంత వరకు సకాలంలో అందిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే రుణం మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. కలెక్టరేట్​లో 41వ టీఎస్-ఐపాస్ జిల్లా పరిశ్రమల అభివృద్ధి కమిటీతో నిర్వహించిన ఈ సమావేశానికి పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ బాబురావు, విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్, గిరిజన సంక్షేమ శాఖ అధికారిణి సంధ్యారాణి, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.