రాష్ట్రంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల దగ్గర తేమ, తాలు పేరుతో గిట్టుబాటు ధర ఇవ్వకుండా.. క్వింటాకు పది కిలోల తరుగు తీస్తూ.. రైతుల పొట్టగొడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వంలో మంత్రుల శాఖలు మంత్రులకే తెలియని స్థితిలో ఉన్నారని దుయ్యబట్టారు.
ఏ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలన్నా.. కేటీఆర్ ప్రారంభించాలి అన్న ధోరణిలో పాలన సాగుతోందని ఎద్దేవా చేశారు. నిన్నగాక మొన్న సిద్దిపేటలో ప్రారంభించిన రంగనాయక సాగర్ను కేటీఆర్ ప్రారంభించడానికి.. ఆయన ఏమైనా నీటిపారుదల శాఖ మంత్రా అంటూ... సీఎం కేసీఆర్ను ప్రశ్నించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రైతులకోసం చేపట్టిన ఉపవాస దీక్షతో స్పందించిన ముగ్గురు మంత్రులు కూడా.. ప్రగతి భవన్ నుంచి వచ్చిన జిరాక్స్ కాపీని యధావిధిగా చదివారని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: ప్రపంచంపై 'కరోనా' కరాళ నృత్యం.. 2 లక్షలు దాటిన మృతులు