నిజామాబాద్ జిల్లా కేంద్రంలో త్రివిధ దళాల్లో పనిచేస్తున్న సైనికుల త్యాగాలకు గుర్తుగా సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎం.రామ్మోహన్ రావు తొలి విరాళంతో పతాక నిధి సేకరణ ప్రారంభించారు.
దేశ రక్షణంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలకు ఆర్థికంగా సహకరించేందుకు సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి ప్రజలు, విద్యాసంస్థలు, పరిశ్రమల నుంచి ఎన్‌సిసి కేడెట్లు హుండీ బాక్సుల ద్వారా విరాళాలు సేకరిస్తారని తెలిపారు. జిల్లా సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తదితరులు ఇందులో పాల్గొన్నారు.
ఇవీ చూడండి: 'దిశ' నిందితుల ఎన్కౌంటర్పై సుప్రీంలో వ్యాజ్యం