ETV Bharat / city

పాఠశాలలకు సెలవులు... భారీ వర్షాలే కారణం - పలు జిల్లాల్లో భారీ వర్షాలు

భారీ వర్షాలు, వరదల ధాటికి పలు జిల్లాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న జోరువానలకు.. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఫలితంగా నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యాసంస్థలకు కలెక్టర్లు సెలవులు ప్రకటించారు.

schools holidays
schools holidays
author img

By

Published : Sep 7, 2021, 2:48 PM IST

రాష్ట్రంలో రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. పలు కాలనీలు, ఇళ్లు నీట మునిగాయి. నిజామాబాద్​, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధాన రహదారులపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. వర్షాల ప్రభావంతో ఆయా జిల్లాల యంత్రాంగం అప్రమత్తమైంది.

నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. భారీ వర్షాలు, వరదల దృష్ట్యా పాఠశాలలకు సెలవులు ఇచ్చినట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు వెల్లడించారు.

ఇదీచూడండి: live video: వరద ఉద్ధృతికి కూలిపోయిన బ్రిడ్జి సెంట్రింగ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.